జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్యూఎం) కు కేబినెట్ ఆమోదం
మే 1 న పట్టణ పేదల ఆరోగ్య సంరక్షణకు ఉద్దేశించిన రూ.22,507 కోట్ల విలువైన జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్యూఎం) కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.దేశవ్యాప్తంగా 50 వేలకు పైగా జనాభా కలిగిన 779 నగరాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలోనే దీనిని ఉప పథకంగా అమలు చేస్తారు.7.75 కోట్లకు పైగా ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది. పట్టణ ప్రజానీకంలోని సాధారణ, పేద, ఇతర అణగారినవర్గాల ఆరోగ్య స్థాయిని మెరుగుపరచడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు.